ఉపాధ్యాయులు రాధాకృష్ణన్ ని ఆదర్శంగా తీసుకోవాలి : డిఇఓ
గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శంగా తీసుకోవాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష అన్నారు. గుంటూరు పాత బస్టాండ్ కూడలిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గల సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ వలన ఏ వృత్తిలో ఉన్న వారికి లేని గౌరవం ఉపాధ్యాయ వృత్తి కి ఉన్నదన్నారు. అందువలన ఉపాధ్యాయులు ఉన్నత ఆశయంతో వారి ఆశయాలకు అనుగుణంగా...