Friday, September 11, 2026
spot_imgspot_img

రవాణాశాఖలో 83 సేవలు పూర్తిగా ఆన్లైన్లో

Must read

📰 Generate e-Paper Clip

పౌరులు ఆన్లైన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : సీతారామిరెడ్డి

గుంటూరు, 27 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రవాణాశాఖలో 83 సేవలను ప్రభుత్వం ఆన్లైన్ విధానంలో అందుబాటులోకి తీసుకువచ్చిందని, ప్రజలు అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని ఉప రవాణా కమిషనర్ సీతారామిరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా లెర్నర్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఇతర ఆన్లైన్ సేవలకు సంబంధించిన ప్రభుత్వ రుసుములు సంబంధిత పోర్టల్లోనే నిర్ణయించబడి ఉంటాయని తెలియజేశారు.

మెడికల్ సర్టిఫికేట్: మోటారు వాహన చట్టం ప్రకారం రవాణా డ్రైవింగ్ లైసెన్స్ పొందుటకు మరియు లైసెన్స్ రెన్యూవల్ సమయంలో ఫారం 1ఏ లో వైద్య ధృవీకరణ పత్రం తప్పనిసరి. ఈ ఫారం 1ఏ ను దరఖాస్తుదారుడు సారథి పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే సమయంలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న ఫారంను ఎంబీబీఎస్ డిగ్రీ కలిగిన ఏదైనా అధీకృత వైద్యుని వద్దకు వెళ్లి అటెస్టేషన్ చేయించుకుని, తిరిగి సారథి పోర్టల్ లో అప్లోడ్ చేసే సౌకర్యం కలదు. ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ లో దరఖాస్తుదారుడే చేసుకోవాలి. దీనికి ఈ కార్యాలయం ఎటువంటి ఫీజు వసూలు చేయదు.

గ్రీస్ ట్యాక్స్ : ఫిట్నెస్ ఫీజులు తదితర అన్ని రవాణాశాఖ సేవలకు సంబంధించి వాహన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఎవరైనా సి ఎస్ సి / ఆన్లైన్ సెంటర్ నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకు మించి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసినా లేదా, గ్రీస్ ట్యాక్స్, ఫిట్నెస్ ఫీజులు తదితర అన్ని రవాణాశాఖ సేవలకు సంబంధించి వాహన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఎవరైనా సి ఎస్ సి / ఆన్లైన్ సెంటర్ నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకు మించి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసినా లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, సంబంధిత రసీదు మరియు వివరాలతో రవాణాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు మరియు వాహనాల రిజిస్ట్రేషన్లు : ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు మరియు వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి వాహన డీలర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రతి షోరూముల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల వివరాలతో కూడిన ఫీజు చార్టును స్పష్టంగా ప్రదర్శించాలని, ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరాదని సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. వాహన డీలర్లు వాహన కొనుగోలుదారుల నుంచి వసూలు చేసే సర్వీస్ ఛార్జీలు లేదా ఇతర రుసుములకు రవాణాశాఖకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ప్రజాసేవలను మెరుగుపరుచుటకు తీసుకుంటున్న చర్యలు : 1. ఎల్ ఎల్ ఆర్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ సారథి . పరివాన్ . జి ఓ వి .ఇన్ వెబ్సైట్ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలా పొందాలి అనే దానిపై వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో ప్రజలకు చేరేలా ఉంచడమైనది. 2. డ్రైవింగ్ టెస్టుకు వచ్చే దరఖాస్తుదారులకు ఎం.వి.ఐ.లచే ట్రాక్ గురించి వివరించడం, ఎక్కడ తప్పులు జరుగుతాయో చెప్పి, భయం లేకుండా టెస్టుకు హాజరయ్యేలా అవగాహన కల్పించడమైనది.

వాహన (వాహన రిజిస్ట్రేషన్లు): 1. వాహన డీలర్లకు కస్టమర్లతో మర్యాదగా ప్రవర్తించాలని సున్నితంగా తెలియజేయడమైనది. 2. ఆర్టిఏ చార్జీలు, హ్యాండ్లింగ్ చార్జీలు, యాక్ససరీస్ పేరుతో నిర్ణయించిన ఫీజుకు మించి అదనంగా వసూలు చేయవద్దని ఆదేశించడమైనది.3. డిమాండ్ ఉన్న వాహనాలకు ప్రీమియం వసూలు చేయవద్దని ఆదేశించడమైనది.4. వాహన కొనుగోలుదారుని తమ షోరూమ్ లోనే ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఒత్తిడి చేయవద్దని, అది కొనుగోలుదారుని ఇష్టానికే వదిలేయాలని తెలియజేయడమైనది. 5. టి ఆర్ / పి ఆర్ లేకుండా వాహనాలు డెలివరీ చేయవద్దని ఆదేశించడమైనది. లైఫ్ టాక్స్ స్లాబులు, ఫీజులు, సర్వీస్ చార్జీలు, కార్డు ఫీజు, రోడ్ సిఫ్టీ సెస్ మొదలైన వివరాలతో కూడిన బోర్డులను ప్రముఖ ప్రదేశాల్లో ప్రదర్శించాలని ఆదేశించడమైనది.

టాక్స్ , పెర్మిట్ , ఎఫ్ సి : 1.టాక్స్ & పర్మిట్ సేవలు ఆటో అప్రూవల్ లో ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్లో చార్టులను వీడియో ద్వారా వివరించి మీడియాలో ఉంచుతున్నాము. 2. గుంటూరు జిల్లాలోని ఆటోమేటెడ్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్ ( ఏ టి ఎస్ ) అయిన ది రాయల్ ఏజెన్సీస్ వారికి ఎఫ్ సి సేవలను ఎటువంటి అవినీతి, వేధింపులు లేకుండా పారదర్శకంగా అందించాలని ఆదేశించడమైనది. ప్రజలకు రవాణాశాఖ అందిస్తున్న సేవలు పారదర్శకంగా, నిబంధనల ప్రకారం, ఆన్లైన్ విధానంలో అందించేందుకు శాఖ నిరంతరం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. ఎవరైనా సి ఎస్ సి / ఆన్లైన్ సెంటర్ నిర్వాహకులు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసినా లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, సంబంధిత రసీదు/వివరాలతో రవాణాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని ఉప రవాణా కమిషనర్ తెలియజేశారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.