రవాణాశాఖలో 83 సేవలు పూర్తిగా ఆన్లైన్లో

పౌరులు ఆన్లైన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : సీతారామిరెడ్డి గుంటూరు, 27 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రవాణాశాఖలో 83 సేవలను ప్రభుత్వం ఆన్లైన్ విధానంలో అందుబాటులోకి తీసుకువచ్చిందని, ప్రజలు అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని ఉప రవాణా కమిషనర్ సీతారామిరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా లెర్నర్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఇతర ఆన్లైన్ సేవలకు సంబంధించిన ప్రభుత్వ రుసుములు సంబంధిత పోర్టల్లోనే నిర్ణయించబడి ఉంటాయని తెలియజేశారు. మెడికల్ సర్టిఫికేట్: మోటారు వాహన చట్టం ప్రకారం రవాణా...