Friday, September 11, 2026
spot_imgspot_img

జి‌ఎం‌సిలో రెండో రోజు కొనసాగిన ఏసీబీ దాడులు

Must read

📰 Generate e-Paper Clip

జిఎంసి ఇంజనీరింగ్ విభాగంలో 2017-2025 మధ్యలో 152 పనుల్లో అవినీతి జరిగిందని నిర్ధారణ

సంవత్సరానికి కోటి పద్దెనిమిది లక్షలు రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ కి నష్టం

గుంటూరు, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో రెండో రోజు కూడా ఏసీబీ దాడులు కొనసాగాయి. ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ సంవత్సరానికి కోటి పద్దెనిమిది లక్షలు రూపాయలు, మున్సిపల్ కార్పొరేషన్ కి నష్టం వాటిలినట్లు ప్రాథమిక నిర్ధారణ తేలింది. తదుపరి దర్యాప్తులో ఇంకా ఏదైనా ఉంటే బయటికి వస్తాయి. టెండర్ పర్సంటేజ్ లో మ్యన్పులేషన్ చేశారు. అసలు కొన్ని టెండర్స్ వేయలేదని తనిఖీల్లో తేలింది. ఈ విధంగా రెండు విధాలుగా మ్యన్ ప్లేట్ చేసి అక్రమాలు జరిపారు. ఇందులో ఎంతమంది ఉన్నారో ఎవరెవరు అధికారులు ఉన్నారో మొత్తం బయటికి తీసి గవర్నమెంట్ కి ఒక నివేదిక ఇస్తాం. 152 పనుల్లో రిపీటెడ్ గా కొంతమంది కాంట్రాక్టర్లు వస్తున్నారు. కొన్ని సింగిల్ కాంట్రాక్టర్లు గా ఉన్నారు. నిన్న 40,340 రూపాయలు డబ్బులు కూడా దొరికాయి అవి ఎవరవి అనేది ఇంకా నిర్ధారణకి రాలేదు. ‘2017 నుండి 2018 ఇంజనీర్ విభాగంలో పని చేసిన అధికారులందరూ దీంట్లో ఉన్నట్టే. ఇంకా ఎవరెవరు ఉన్నారో బయటకి వస్తారు’ అని తెలిపారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.