గుంటూరు, 25 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరులోని కొరిటపాడు వాకింగ్ ట్రాక్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
నూతన అధ్యక్షుడుగా సింగంశెట్టి కోటేశ్వరరావు, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే గల్లా మాధవి ఇతర నాయకులు పాల్గొని నూతన పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడారు. వాకింగ్ ట్రాక్ లు, పార్కులు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే క్షేత్రాలు అని చెప్పారు. వాకింగ్ ట్రాక్ పాలకవర్గం మొత్తం సమిష్టిగా పని చేసి, అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు.
జేబులు నింపుకునే కమిటీ లేదని, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. వాకింగ్ ట్రాక్ అభివృద్ధి కోసం తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కొరిటపాడు వాకింగ్ ట్రాక్ ను ఆదర్శవంతంగా తీర్చి దిద్దడం జరుగుతుందని వారు వెల్లడించారు.
ఘనంగా కొరిటపాడు వాకింగ్ ట్రాక్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం


