Wednesday, October 28, 2026
spot_imgspot_img

సిద్ధార్థ మెడికల్ కాలేజీ విద్యార్థుల సమ్మె తీవ్రతరం

Must read

📰 Generate e-Paper Clip

రెండో రోజుకు చేరిన నిరసనలు..

రాష్ట్రవ్యాప్తంగా 15వ రోజుకు ప్రవేశించిన ఆందోళన

హాస్టల్ వసతి, స్టైపండ్ కల్పించాలని డిమాండ్

విజయవాడ, 16 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్రవ్యాప్తంగా అలైడ్ హెల్త్ సైన్సెస్, ఎమ్.ఎల్.టి విద్యార్థులు చేపట్టిన సమ్మె బుధవారంతో 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, సిద్ధార్థ మెడికల్ కాలేజీ పరిధిలోని అలైడ్ హెల్త్ సైన్సెస్, ఎమ్.ఎల్.టి విద్యార్థులు ప్రారంభించిన నిరసన దీక్షలు రెండో రోజుకు చేరాయి. తమకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ విద్యార్థులు బుధవారం కళాశాల ప్రాంగణంలో పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థి ప్రతినిధులు మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో తాము అందిస్తున్న సేవలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నా, కనీసం తమను విద్యార్థులుగా గుర్తించడానికి కూడా వెనుకాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లో తమ శ్రమను వాడుకుంటూ కనీస వసతుల కల్పనను విస్మరించడం దారుణమన్నారు. హాస్టల్ సదుపాయం, మెస్ బిల్లుల మంజూరు, నెలవారీ స్టైపండ్ వంటి ప్రాథమిక హక్కుల కోసం తాము వీధిలోకి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కేవలం కాగితాలకే పరిమితమైన స్కాలర్‌షిప్పులు, ఏ ఒక్క విద్యార్థి బ్యాంకు ఖాతాలోనూ జమ కావడం లేదని వారు ఆరోపించారు.
భవిష్యత్తుతో చెలగాటం వద్దు.. నిబంధనల ప్రకారం 12 నెలలు ఉండాల్సిన అకడమిక్ క్యాలెండర్‌ను 16 నెలలకు పొడిగించడమేంటని విద్యార్థులు ప్రశ్నించారు. దీనివల్ల నాలుగేళ్లలో పూర్తి కావాల్సిన కోర్సులు కాస్తా ఆరేళ్లకు చేరుతున్నాయని, దీనివల్ల విద్యార్థుల విలువైన విద్యా సంవత్సరాక్షాలు వృథా అవుతూ భవిష్యత్తు అంధకారంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అకడమిక్ క్యాలెండర్‌ను క్రమబద్ధీకరించాలని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.