Wednesday, October 28, 2026
spot_imgspot_img

సర్కారు బడుల్లో పసి ప్రాణాల బలిపీఠం

Must read

📰 Generate e-Paper Clip

అధికారుల నిర్లక్ష్యంతో పాతాళానికి విద్యా వ్యవస్థ!
పుస్తకాలు పట్టాల్సిన చేతులతో వాటర్ ట్యాంక్ క్లీనింగ్.. నిమ్మకు నీరెత్తిన విద్యాశాఖ!
‘పెద్దవాళ్లం ఎక్కలేం.. పిల్లలే చేస్తారు’ అంటూ సిబ్బంది అహంకారపూరిత సమాధానం
దొరికిపోయిన హెచ్‌ఎం, సిబ్బందిని కాపాడేందుకు ఎం‌ఈ‌ఓ ల తాపత్రయం?
దామరపల్లి ప్రభుత్వ పాఠశాలలో దారుణంపై భగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు !

​గుంటూరు, 23 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు క్రమంగా బానిస శిబిరాలుగా మారిపోతున్నాయా అనే అనుమానాలు బలపడుతున్నాయి. పేద, బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన చదువు అందించాల్సిన ఉపాధ్యాయులు, వారిని పారిశుధ్య పనులకు, ప్రమాదకర పనులకు బలవంతంగా నెడుతున్నారు. గుంటూరు జిల్లా దామరపల్లి ప్రభుత్వ పాఠశాలలో ముగ్గురు మైనర్ విద్యార్థులను ఏకంగా భవనంపైకి ఎక్కించి, ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకును కడిగించిన ఉదంతం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.
​ప్రాణాలతో చెలగాటం.. నిధులు ఎవరి జేబుల్లోకి ?
పాఠశాలల నిర్వహణ, శానిటేషన్, వాటర్ ట్యాంకుల క్లీనింగ్ కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ, ఆ నిధులను స్వాహా చేస్తూ చిన్నారుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ప్రమాదకర ఎత్తులో ఉన్న ట్యాంకులోకి పిల్లలను దింపి పనులు చేయిస్తుండగా చూసిన ఏఐఎస్ఎఫ్ బృందం అప్రమత్తమై పిల్లలను సురక్షితంగా కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. కనీస భద్రత లేకుండా పసి ప్రాణాలతో చెలగాటమాడుతున్న హెచ్‌ఎం, సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ మాత్రం కళ్లుండి చూడలేని గుడ్డిదానిలా వ్యవహరిస్తోంది.
​సిబ్బంది బరితెగింపు.. అధికారుల రక్షా కవచం:
అమానవీయ ఘటనపై ప్రశ్నించిన నాయకులను ఉద్దేశించి “పైకి పెద్దవాళ్లు ఎక్కలేరు కాబట్టే పిల్లలతో చేయిస్తున్నాం” అని పాఠశాల సిబ్బంది నిర్లజ్జగా సమాధానమివ్వడం వ్యవస్థలోని బరితెగింపునకు నిదర్శనం. ఇంతటి దారుణం బయటపడినా మండల విద్యాశాఖ అధికారులు (ఎం‌ఈ‌ఓ), నిందితులైన ప్రధానోపాధ్యాయులు, సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకోకుండా దాటవేత ధోరణి ప్రదర్శించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయ సంఘాల లాబీయింగ్, రాజకీయ పలుకుబడితో తప్పు చేసిన వారిని కాపాడుతూ పేద విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
​చట్టాల ఉల్లంఘన.. చర్యలకు ఏ‌ఐ‌ఎస్‌ఎఫ్ డిమాండ్
బాలల హక్కుల పరిరక్షణ చట్టం, విద్యా హక్కు చట్టం (ఆర్‌టి‌ఈ) నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థులను వెట్టిచాకిరీకి గురిచేసిన వారిపై కింది చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ (ఏ‌ఐ‌ఎస్‌ఎఫ్) గుంటూరు జిల్లా సమితి డీఈవోకు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేసింది. ​దామరపల్లి పాఠశాల ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపి నివేదికను బహిర్గతం చేయాలి. ​విద్యార్థుల ప్రాణాలను రిస్క్‌లో పెట్టిన ప్రధానోపాధ్యాయులు, బాధ్యులైన సిబ్బందిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి, సర్వీస్ నుంచి సస్పెండ్ చేయాలి. ​పాఠశాలల పర్యవేక్షణ గాలికొదిలేసి నిందిలను వెనుకేసుకొస్తున్న విద్యాశాఖ అధికారులపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి. ​జిల్లాలోని ఏ బడిలోనూ విద్యార్థులతో ఇలాంటి పనులు చేయించకుండా తక్షణమే కఠిన ఉత్తర్వులు జారీ చేయాలి. ​తప్పు చేసిన హెచ్‌ఎం, సిబ్బందిని కాపాడే ప్రయత్నం చేస్తే విద్యాశాఖ కార్యాలయాలను ముట్టడించి, కలెక్టరేట్ ఎదుట భారీ ఎత్తున నిరసనలకు దిగుతామని ఏఐఎస్ఎఫ్ హెచ్చరించింది.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.