Friday, September 11, 2026
spot_imgspot_img

యువత భవిష్యత్తును అడ్డుకునే కుట్ర చేస్తున్న జగన్

Must read

📰 Generate e-Paper Clip

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, 07 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కూటమి ప్రభుత్వం ఏ మంచి పని చేసినా అడ్డుకోవడం, తప్పుడు ప్రచారం చేయడమే పనిగా జగన్ రెడ్డి, గొడ్డలి పార్టీలు పెట్టుకున్నాయని టీడీపీ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మండిపడ్డారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మెగా డిఎస్సి కూడా గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రతి విషయంలో ఒక ట్రాన్పరెంట్ గా డిఎస్సిని 148 రోజుల్లో నిర్వహించాం. దాదాపు 15,941 ఉద్యోగాలను రికార్డ్ టైంలో భర్తీ చేస్తే, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని, ఒక్క డిఎస్సి కూడా పెట్టలేని జగన్ రెడ్డి నేడు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఆర్బీఐ నిర్వహించే విధంగా మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సిని నిర్వహించారు. జాబ్ క్యాలెండర్, ఇళ్ల పట్టాలు, పేదలకు ఇళ్లు వంటి అనేక హామీలు ఇచ్చి జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తే,మేం ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఏటా డిఎస్సి నిర్వహించేలా ప్రణాళికలు రచించాం. యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూనే మెగా డిఎస్సి నిర్వహించాం. 2026 మే నుంచి గొడ్డలి పార్టీ ఒక తామాషా ప్రారంభించింది. హై కోర్టుకు పోవడం పిల్ వేయడం, కోర్టు కొట్టేయడం, వైసీపీ నాయకులకు చివాట్లు పెట్టడం షరమాములగా అయింది. ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వంపై డిక్టేటర్ షిప్ అంటూ సోషల్ మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హైకోర్టు చెప్పింది కూడా అర్థం చేసుకోలేని అజ్ఞాలు వైసీపీలో కొనసాగుతున్నారు. రాజకీయం చేయాలంటే చాలా అంశాలు ఉన్నాయి. కానీ మన పిల్లల భవిష్యత్‌పై జగన్ రెడ్డి దాడి చేస్తున్నాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎలాంటి తప్పు జరగలేదని చెబుతున్నా కూడా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. సీబీఐ విచారణ దేనికి వేస్తారో కూడా తెలియని అసమర్థుడు జగన్. జగన్ రెడ్డి రాజకీయ జీవితమే ఒక ఫేక్. అందుకే ఆయనకు ప్రతిదీ ఫేక్ లా కనిపిస్తుంది. తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? కర్నూలు జిల్లాకు చెందిన భార్య, భర్తల కరిష్మా, షేక్ ఇమామ్‌లపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఒక్క ఆధారం కూడా లేకుండానే డిఎస్సిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.   చదువుతున్నప్పుడు మాత్రమే స్పోర్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని ఏ రూల్స్ ప్రకారం ఉందో గొడ్డలి పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. భార్య ఒక కేటగిరి, భర్త మరో కేటగిరిలో ప్రతిభ చాటారు. ఉద్యోగాలు తెచ్చుకున్నారు. భార్యభర్తలు ఉద్యోగాలు పొందకూడదనే రూల్ ఎక్కడైనా ఉందా.? పారదర్శకంగా ఉద్యోగాలు సాధించిన యువత జీవితాలతో గొడ్డలి పార్టీ రాజకీయం చేస్తోంది. దేశంలో 60 ఏళ్ల వయసు ఉన్న వాళ్లు కూడా అథ్లెటిక్స్ లో ప్రతిభ చాటుతున్నారు. గోల్డ్ మెడల్ సాధిస్తున్నారు. 41 ఏళ్ల కొరడా పద్మజా స్పోర్ట్స్ లో ప్రతిభ చాటిన మహిళ. అథ్లెటిక్ లో మెడల్ సాధించి ఉద్యోగం సాధిస్తే ఎలా 41 ఏళ్లకి స్పోర్ట్స్ ఆడిందని మాట్లాడే గొడ్డలి పార్టీ నాయకులకు సిగ్గుండాలి. 41 ఏళ్లకి స్పోర్ట్స్ ఆడకూడదు అనే నియమం ఏమీ లేదు కదా. నిజాయితీగా ఉద్యోగాలు సాధించిన వారి పట్ల వైసీపీ ఎందుకు ఇంత విషపూరిత రాజకీయాలు చేస్తోంది. రేపు భవిష్యత్ లో జరగబోయే మరో డిఎస్సిని అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. ప్రతి ఏటా డిఎస్సి ఇస్తామని లోకేష్ ప్రకటించారు. రాబోయే డిఎస్సి నియామకాలను తప్పుబట్టి యువతకు ఉద్యోగాలు సాధించకుండా అడ్డుకునే కుట్రకు జగన్ తెర తీశాడు. యువత అంతా మరో డిఎస్సీ కోసం సిద్ధమవుతుంటే, మరో డిఎస్సీని అడ్డుకునేందుకు జగన్ రెడ్డి, గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. ఫేక్ ప్రచారాలతో, తప్పుడు ఆధారాలతో, ఏపీపీఎస్సీ, డిఎస్సీకి తేడా తెలియదు, స్పోర్ట్స్ కి, బ్రిడ్జ్ గేమ్, పేకాటకు తేడా తెలియదు. ఒక మాట అనేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునే గొడ్డలి పార్టీ, ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లతో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష పత్రాలు దిద్దించారు. మరీ వైసీపీని బర్తరఫ్ చేస్తారా సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలి. గ్రూప్ 1 తప్పిదాలపై జగన్ రెడ్డి రాజీనామా చేసి రాజకీయాలు వదిలేస్తాడా? సొంత పార్టీ నాయకులకు డిఎస్సీ పరిక్షలు రాయించి, వారిచేతనే నేడు తప్పుడు ఆరోపణలు చేస్తూ డ్రామాలు ఆడుతున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో సానుభూతి రాకపోగా, ఇంకా కిందికి పడిపోతారు. యువత జీవితాలతో ఆడుకోవద్దని జగన్ రెడ్డిని కోరుతున్నాం. ప్రతి ఏటా నిర్వహించే డిఎస్సిలో యువత ఉద్యోగాలు సాధిస్తారు, జగన్ నాలుగు గోడల మధ్య మాట్లాడే మాటలు గొడ్డలి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పనికొచ్చేవి చేస్తే బాగుంటాయి. కూటమి ప్రభుత్వంపై, చంద్రబాబు, లోకేష్ ల విధానాలపై మాట్లాడే అర్హత జగన్ కు లేదు. ప్రజలు ఇప్పటికే జగన్ రెడ్డిని ఛీ కొడుతున్నారన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.