Wednesday, October 28, 2026
spot_imgspot_img

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం

Must read

📰 Generate e-Paper Clip

మాజీమంత్రి అంబటి రాంబాబు

గుంటూరు, 18 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : త్వరలో జరగబోయ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు తెలిపారు. ఈ నెల 20 న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు అనుసరించవలసిన విధివిధానాలపై అమరావతి రోడ్డులోని ‘ఏ వన్’ కన్వెన్షన్ లో సమావేశం నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు, ఈస్ట్ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా, తాడికొండ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) పలువురు మాజీ కార్పొరేటర్లు, పలు డివిజన్ల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడుతూ అన్ని డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందన్నారు. కూటమి అక్రమాలకు పాల్పడితే, చూస్తూ ఊరుకోమని చట్ట ప్రకారం పోరాటం చేస్తామన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.