మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం
మాజీమంత్రి అంబటి రాంబాబు గుంటూరు, 18 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : త్వరలో జరగబోయ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు తెలిపారు. ఈ నెల 20 న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు అనుసరించవలసిన విధివిధానాలపై అమరావతి రోడ్డులోని 'ఏ వన్' కన్వెన్షన్ లో సమావేశం నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు, ఈస్ట్...