ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు
ప్రత్తిపాడు, 21 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రత్తిపాడు నియోజకవర్గంలో సోమవారం (సెప్టెంబర్ 21) 100 మంది లబ్ధిదారులకు రూ.1.09 కోటి విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, ఎల్‌ఓసీ లు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 1381 మందికి రూ.13.99 కోట్ల ఆర్థిక సాయం అందించిన కూటమి ప్రభుత్వం – గారు.*గుంటూరులో ప్రత్తిపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులు మరియు ఎల్‌ఓసీ (LOC)ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్యులు అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయపత్రాలను స్వయంగా అందించి, వారి ఆరోగ్య స్థితిగతులను, క్షేమ సమాచారాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి అత్యుత్తమ వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలకు భరోసా కల్పించడమే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వ ప్రధాన సంకల్పమని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ నిరుపేద కుటుంబం కూడా వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున సీఎంఆర్‌ఎఫ్ నిధులను మంజూరు చేస్తోందని కొనియాడారు. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రుల్లో చేరిన బాధితులకు తక్షణ అత్యవసర చికిత్సల కోసం ఎల్‌ఓసీలు (Letter of Credit) జారీ చేస్తూ, శస్త్ర చికిత్సల అనంతరం ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల రూపంలో నిధులు అందజేస్తూ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటోందని ఆయన చెప్పారు. ఈ విడత సీఎంఆర్‌ఎఫ్ సాయంలో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి కోటి మంజూరయ్యాయని ఎమ్మెల్యే గారు వెల్లడించారు. దీనిద్వారా మొత్తం 100 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరిందని, అందులో అత్యవసర వైద్యం కోసం 32 మందికి ఎల్‌ఓసీలు, అలాగే 68 మంది బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రత్తిపాడు నియోజకవర్గ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు రికార్డు స్థాయిలో మొత్తం 1381 మంది నిరుపేద బాధితులకు రూ.13.90 విలువైన ఉచిత వైద్య సహాయాన్ని అందించామని ఎమ్మెల్యే రామాంజనేయులు గారు వివరాలు వెల్లడించారు. ఇందులో 316 మందికి ఎల్‌ఓసీల ద్వారా ఆసుపత్రుల్లో ప్రాణాపాయ స్థితిలో తక్షణ చికిత్స అందించగా, 1065 మందికి చెక్కుల రూపంలో ఆర్థిక సాయంఅందించామని తెలియజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే కాకుండా, ప్రజల శ్రేయస్సు కోసం చెప్పని అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలనలో పూర్తిగా నిర్వీర్యమై, అభివృద్ధిలో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేడు అభివృద్ధి, సంక్షేమ రంగాలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు వేగంగా పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యానికి, సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు లబ్ధిదారులకు స్వీట్లు తినిపించారు. లబ్ధిదారులు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.*ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, లబ్ధిదారులు,అభిమానులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.


