Thursday, September 10, 2026
spot_imgspot_img

బ్రాహ్మణ కార్పొరేషన్ అభివృద్ధికి కూటమి పెద్దల సహకారం హర్షణీయం

Must read

📰 Generate e-Paper Clip

సీఎం, డిప్యూటీ సీఎం, బి‌జే‌పి పివిఎన్ మాధవ్ కి ధన్యవాదాలు

ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్

గుంటూరు, 20 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : బ్రాహ్మణ కార్పొరేషన్ అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి అపము ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పిబిఎన్ మాధవ్ కి ఓటమి పెద్దలకి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2014లో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, ఆగస్టు 20వ తేదీ నాటికి 12 సంవత్సరాల పూర్తయిందన్నారు. 2014న ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో బ్రాహ్మణ సంక్షేమం కోసం తొలిసారిగా రూ.25 కోట్ల నిధులను కేటాయించారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం సంస్థాగతంగా బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేసి నేటికీ 12 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తిచేసుకుని నేటికి రూ.270 కోట్ల టర్నవర్ తో నేటికీ క్రెడిట్ సొసైటీ సభ్యత్వాలు 82,000 మంది, సభ్యుల యొక్క డిపాజిట్లు 77 కోట్ల రూపాయలుతో, అదేవిదంగా మెంబర్స్ యొక్క లోన్లు రూ.112 కోట్లతో దిగ్విజయంగా ముందుకు సాగుతూ ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఏకైక సంస్థ బ్రాహ్మణ కార్పొరేషన్ మరియు అనుబంధ సంస్థ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ. గత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 2019-2024 మధ్యకాలంలో మన బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తూ మన కార్పొరేషన్ కు రావాల్సిన నిధులన్నీ కూడా దారి మళ్లించి బ్రాహ్మణులకు ద్రోహం చేసిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తన స్వార్థపూరిమైన రాజకీయం కోసం మన బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులను కూడా నవరత్నాలుకు మళ్లించి బ్రాహ్మణులకు రావలసిన పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేసిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. మరల 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ బ్రాహ్మణ సోదరులను దృష్టిలో పెట్టుకొని మరలా బ్రాహ్మణ కార్పొరేషన్ కు, కార్పొరేషన్లకు పూర్వ వైభవం తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియ జేసుకుంటున్నానని గంగాధర్ తెలియజేశారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.