Friday, September 11, 2026
spot_imgspot_img

అంగరంగ వైభవంగా కన్నాలక్ష్మి నారాయణ రాజకీయ స్వర్ణోత్సవ సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

జన్మదిన సందర్బంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించిన నాయకులు కార్యకర్తలు

రాష్ట్ర మరియు నియోజకవర్గ నలుమూలల నుంచి పాల్గొన నాయకులు, కార్యకర్తలు

జన్మదిన సందర్భంగా అభిమానులు ఉదయం నుంచి సాయంత్రం వరకు టపాసులు పేల్చిన వైనం

నియోజకవర్గాలు మారాయి.. కాలం మారింది.. కానీ కన్నాపై ప్రజల అభిమానం మారలేదు

యువ రాజకీయ నాయకత్వానికి కన్నా లక్ష్మీనారాయణ జీవితం ఒక స్ఫూర్తి

ఐదు దశాబ్దాల ప్రజాజీవితమే అతిపెద్ద రాజకీయ విశ్వవిద్యాలయం

తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మాజీ మంత్రివర్యులు, సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి జన్మదిన సందర్భంగా గుంటూరు శ్రీ కన్వెన్షన్ నందు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను నియోజకవర్గ నాయకులు, ప్రజల కేరింత ల మధ్య కట్ చేసి, తినిపించారు.

సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఐదు దశాబ్దాల పాటు ప్రజల మధ్యే ఉంటూ వారి విశ్వాసాన్ని, అభిమానాన్ని నిలబెట్టుకోవడం సాధారణ విషయం కాదని, సీనియర్ నాయకుడు, సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ జీవితం నేటి యువ నాయకత్వానికి ఒక స్ఫూర్తిదాయక పాఠమని గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ గారి 50 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానం – రాజకీయ స్వర్ణోత్సవ సంబరాల్లో కూటమి పార్టీల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం అంటే సాధారణ విషయం కాదు. ఒక ఎన్నిక గెలవడం గొప్ప విషయం కావచ్చు. కానీ ఐదు దశాబ్దాల పాటు ప్రజల మధ్య ఉండి, వారి విశ్వాసాన్ని, అభిమానాన్ని నిలబెట్టుకోవడం అసాధారణమైన విషయం. విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైన కన్నా లక్ష్మీనారాయణ ప్రయాణం గుంటూరు జిల్లా యూత్ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించే స్థాయికి ఎదిగింది’’ అని కొనియాడారు.

1989, 1994, 1999, 2004లో పెదకూరపాడు నుంచి, 2009లో గుంటూరు వెస్ట్ నుంచి, 2024లో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం కన్నా లక్ష్మీనారాయణపై ప్రజలకు ఉన్న అపారమైన నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. ‘నియోజకవర్గాలు మారాయి… కాలం మారింది… రాజకీయ పరిస్థితులు మారాయి… కానీ కన్నాపై ప్రజల అభిమానం మాత్రం మారలేదు. అదే ఆయన నిజమైన రాజకీయ బలం అని అచ్చెన్నాయుడు అన్నారు. మంత్రిగా పరిశ్రమలు, వాణిజ్యం, ఎగుమతులు, ఫుడ్ ప్రాసెసింగ్, గృహ నిర్మాణం, వ్యవసాయం వంటి కీలక శాఖలను నిర్వహించి కన్నా లక్ష్మీనారాయణ తనదైన ముద్ర వేశారని తెలిపారు. 2018–2020 మధ్య రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా పార్టీకి నాయకత్వం వహించారని గుర్తుచేశారు. రాజకీయాల్లో ఎన్నో పదవులు నిర్వహించినప్పటికీ ప్రజలతో ఉన్న ఆత్మీయ అనుబంధమే కన్నా లక్ష్మీనారాయణను ప్రత్యేకమైన నాయకుడిగా నిలబెట్టిందన్నారు.

‘‘కన్నా రాజకీయ జీవితాన్ని చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. రాజకీయమంటే పదవి కాదు… బాధ్యత. రాజకీయమంటే అధికారం కాదు… ప్రజాసేవ. రాజకీయమంటే ఐదేళ్ల ప్రయాణం కాదు… జీవితకాల నిబద్ధత. ఆయన సంపాదించుకున్న అసలైన ఆస్తి పదవులు కాదు… ప్రజల విశ్వాసం, కార్యకర్తల అభిమానం, ప్రజలతో ఏర్పడిన ఆత్మీయ బంధం’’ అని పేర్కొన్నారు. కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ స్వర్ణోత్సవం ఒక వ్యక్తికి సంబంధించిన వేడుక మాత్రమే కాదని, ప్రజాజీవితంలోకి రావాలనుకునే ప్రతి యువ నాయకుడికి ఆయన ప్రస్థానం ఒక స్ఫూర్తి అని అన్నారు. ‘‘ఐదు దశాబ్దాల ప్రజాజీవితమే అతిపెద్ద రాజకీయ విశ్వవిద్యాలయం. కన్నా గారూ… మీరు 50 ఏళ్ల రాజకీయ మైలురాయిని చేరుకున్నారు. కానీ ఇది ముగింపు కాదు… మరో కొత్త అధ్యాయానికి ప్రారంభం కావాలి. మీ అనుభవం రాష్ట్రానికి, మీ రాజకీయ పరిజ్ఞానం యువ నాయకత్వానికి మరింత ఉపయోగపడాలి’’ అని ఆకాంక్షించారు. కన్నా లక్ష్మీనారాయణ గారు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండి, మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ‘‘జన నాయకుడు కన్నా 50 ఏళ్ల రాజకీయ స్వర్ణోత్సవ ప్రస్థానానికి హృదయపూర్వక అభినందనలు. ఆయన ప్రజాసేవా ప్రస్థానం చిరస్థాయిగా కొనసాగాలి’’ అంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఒక్కసారి గెలవడమే కష్టంగా ఉన్న రోజుల్లో ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడం అంత సులభం కాదని ఏపి శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆరుసార్లు గెలుపొందిన కన్నా జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాజకీయాల్లో యాభై ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు పాల్గొన్నారు.

1973లో ఎన్ ఎస్ యు ఐ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానాన్ని కన్నా లక్ష్మీ నారాయణ ప్రారంభించారు. రాజకీయాల్లోకి వచ్చి యాభై ఏళ్లైన సందర్భంగా కన్నా అభిమానులు, అనుచరులు గుంటూరు శ్రీ కన్వెన్షన్ సెంటర్ లో భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపిలు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. సినీ నటుడు బ్రహ్మానందాన్ని ఈ సందర్భంగా సన్మానించారు. నా స్వంత నియోజకవర్గమైన సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా అని ఆయన పుట్టిన రోజు కూడా కావడంతో ఈ రోజు సభలో పాల్గొనడం సంతోషంగా ఉందని బ్రహ్మానందం అన్నారు. టిడిపి, బిజెపి, జనసేన నేతలు ఈ సభలో పాల్గొన్ని కన్నా సేవలను కొనియాడారు. ప్రతి ఊరిలోనూ స్వంత వర్గం ఉన్న నేతగా కన్నాకు పేరుందని డిప్యూటీ స్పీకర్ రఘరామక్రిష్టం రాజు అన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం మరిన్ని దశబ్దాలు వెలుగొందాలన్నారు. ఏ శాఖ మంత్రిగా పనిచేసినా ప్రజలకు ఆయన సేవలందించారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ కు వ్యతిరేకంగా కూటమీ ఏర్పాటు చేయడంతో ఆయన పాత్ర కూడా ఉందన్నారు. రాష్ట్ర విభజన జరగకుండా ఉంటే కన్నా లక్ష్మీ నారాయణను ముఖ్యమంత్రిగా చూసేవాళ్లమని మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. ఏ బాధ్యత అప్పగించిన దాన్ని పూర్తి చేసే వరకూ అవిశ్రాంతంగా కష్టపడటం కన్నా లక్షణమని ఎంపి పురందేశ్వరి అన్నారు. ఈ సభకు వివిధ నియోజకవర్గాలు, జిల్లాల నుండి అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.