కాకినాడ బ్యూరో, 12 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఐక్య విద్యార్థి సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ పి ఆర్ జూనియర్ కాలేజ్ వద్ద స్వాతంత్ర ప్రజాస్వామ్య సోషలిజం జెండాను నగర అధ్యక్షుడు గమనివేలు జెండా ఎగరవేయడం జరిగింది, ఈ సమావేశానికి కాకినాడ జిల్లా అధ్యక్షులు సిహెచ్ లావరాజు మరియు గమినివేలు మాట్లాడుతూ ఐక్య విద్యార్థి సంఘం ఆనాడు విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలపై 1936లో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏర్పాటుపై విద్యార్థులు కృషి చేశారని అప్పటి నుంచి నేటి వరకు విద్యారంగ సమస్యలపై పోరాటం చేస్తూ, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని,ఫీజుల భారాన్ని తగ్గించి ప్రతి విద్యార్థికి విద్య అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్యంగా ఉద్యమించడం ద్వారా మాత్రమే ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురాగలమని విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాడేందుకు ప్రతి విద్యార్థి ముందుకు రావాలని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి నగర ఉపాధ్యక్షులు పుష్ప నగర సహాయ కార్యదర్శి మణికంఠ ఫియర్ జూనియర్ అధ్యక్ష కార్యదర్శులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా ఐక్య విద్యార్థి సంఘం ఆవిర్భావ దినోత్సవం నిర్వహించిన కాకినాడ నగర కమిటీ


