గుంటూరు, 12 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : యువజన సర్వీసుల శాఖ (స్టెప్), స్వశక్తి గుంటూరు వారి ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ యువజన దినోత్సవమును స్థానిక బ్రాడిపేటలోని బండ్లముడి హనుమయమ్మా మహిళా డిగ్రీ కళాశాల లో జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్తముగా నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ యువజన దినోత్సవము – 2026 “విభిన్న సందర్భాలు, ఉమ్మడి ఆకాంక్షలు” ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత ఎంతగానో భిన్నమైన జాతీయ మరియు స్థానిక వాస్తవాలను ఎదుర్కొంటున్నప్పటికీ, గౌరవం మరియు సుస్థిర అభివృద్ధి కోసం సార్వత్రిక లక్ష్యాలను ఎలా పంచుకుంటున్నారో తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాననుసారం ‘హర్ ఘర్ తిరంగా’ లో భాగముగా తిరంగా ర్యాలీ ను బండ్లముడి హనుమయమ్మా మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులతో కళాశాల నుండి బ్రాడీపేట, 3వ లైన్ వరకు నిర్వహించడం జరిగింది. అనంతరం అతిధులతో స్వామి వివేకానంద చిత్ర పటానికి పూలమాలలు వేయించటం జరిగింది.

ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా విచ్చేసిన గుంటూరు స్టెప్ ముఖ్యకార్య నిర్వహణాధికారి పి.వి.యన్. సత్యనారాయణ మాట్లాడుతూ యువత తలుచుకుంటే ఏ రకమైన మార్పునైనా సాధించగలరని, దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని తెలుపుతూ, వారిలో ఉన్న సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానం సమాజ అభివృద్ధికి దోహదపడతాయని తెలియజేసినారు. మరియు నిరుద్యోగం, అసమానతలు వంటి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని కోరారు.

మరో ముఖ్య అతిధిగా విచ్చేసిన జిల్లా ఉపాధి అధికారి యం.సి.హెచ్. అభినవ్ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ యువత తమ కెరీర్ ను ఏవిధముగా రూపొందించుకోవాలి, అదే విధముగా దానికి యువత చేపట్టవలసిన కృషిని తెలియచేయుచూ, మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని, మీరు కూడా మీ యొక్క సామార్థ్యాము తెలుసుకొని మంచి భవిష్యత్తుకు బాటలు వేయాలని తెలియజేశారు. పి. శ్రీమన్నారాయణ, మేనేజర్, స్టెప్, స్వశక్తి, గుంటూరు, నాస్కాం మరియు యువజన సర్వీసుల శాఖ సంయుక్తముగా నిర్వహించే ఉచిత డిజిటల్ నైపుణ్య శిక్షణకు యువత ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొనగలరని వివరించారు. ఈ కార్యక్రమములో జి. మల్లీశ్వరీ, యంగ్ ప్రొఫెషనర్, ఈ. హారిక, యంగ్ ప్రొఫెషనల్, జిల్లా ఉపాధి కార్యాలయము, గుంటూరు, డా. కౌసల్య దేవి, ప్రిన్సిపాల్ మరియు బండ్లముడి హనుమయమ్మా మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాధ మాధవి, జూనియర్ అసిస్టెంట్ వి.సాయి సాత్విక్ మరియు స్టెప్ సిబ్బంది, కాలేజి అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


