
గుంటూరు, 12 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాజకీయాలలో విలువలతో కూడిన రాజకీయాలు చేసే నాయకుడు మాజీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అని మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీం అయోధ్య ఆధ్వర్యంలో అయోధ్య రామిరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గుంటూరు, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో రీజినల్ కోఆర్డినేటర్ గా అయోధ్య రామిరెడ్డి ఎంతో కృషి చేశారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం కోసం ప్రతి ఒక్కరు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు, మేకతోటి దయాసాగర్, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్ఆర్సిపి నాయకులు సతీష్ రెడ్డి, శ్యామల రవి కిషోర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు తాడిబోయిన వేణుగోపాల్, ఉపాధ్యక్షులు సిరిబోయిన అవినాష్, సురేంద్ర, పలువురు నాయకులు పాల్గొన్నారు.


