గుంటూరు, 29 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఏపీ గ్రీన్ సొసైటీ చైర్‌పర్సన్ కొణిదెల నాగేంద్రబాబు శనివారం అరణ్యారామం ప్రదేశాన్ని సందర్శించి అక్కడ కొనసాగుతున్న పనులను పరిశీలించారు. అరణ్యారామం ప్రదేశంలో చేపడుతున్న వృక్షాల తరలింపు (ట్రాన్స్‌లోకేషన్) ప్రక్రియను ఆయన పరిశీలించి అభివృద్ధి పనుల సందర్భంగా అక్కడ ఉన్న వృక్షాలను పరిరక్షించి సంరక్షించేందుకు అటవీ శాఖ చేస్తున్న కృషిని అభినందించారు. ఇప్పటివరకు వృక్ష సంరక్షణ చర్యల్లో భాగంగా అరణ్యారామం ప్రదేశం నుంచి 45 చెట్లను విజయవంతంగా తరలించారు. అనంతరం కొణిదెల నాగేంద్రబాబు అరణ్యారామం లేఅవుట్ ప్రణాళికలు ప్రతిపాదిత అభివృద్ధి పనులను ప్రదర్శిస్తున్న ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అనంతరం నందనవనం ప్రదేశాన్ని సందర్శించి, శుభప్రదంగా భావించే వేప,రావి చెట్లను కలిపి నాటారు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ కార్యకలాపాలకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులను సమీకరించేందుకు పరిశ్రమలు ఇతర రంగాల ప్రతినిధులకు అవగాహన కల్పించే అంశంపై కొణిదెల నాగేంద్రబాబు అటవీశాఖ అధికారులతో టిచర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో 50 శాతం గ్రీన్ కవర్ సాధించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు పరిశ్రమలు ఇతర భాగస్వామ్య వర్గాలు చురుకైన భాగస్వామ్యం అందించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఈ కార్యక్రమంలో డా. పి.వి.చలపతి రావు, బి.ఎన్.ఎన్. మూర్తి, ఐ.ఎఫ్.యస్, సి.సి.ఎఫ్, యస్.యస్.డీ.ఏ & సీ ఈ ఓ ,ఏపీ గ్రీన్ సొసైటీ వై. శ్రీనివాసులు రెడ్డి, IFS, గుంటూరు, ఎన్. నాగేశ్వరరావు, IFS, సీసీఎఫ్, వైల్డ్‌లైఫ్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
అరణ్యారామం ప్రదేశాన్ని సందర్శించిన ఏపీ గ్రీన్ సొసైటీ చైర్‌పర్సన్ నాగబాబు


