అరణ్యారామం ప్రదేశాన్ని సందర్శించిన ఏపీ గ్రీన్ సొసైటీ చైర్‌పర్సన్ నాగబాబు
గుంటూరు, 29 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఏపీ గ్రీన్ సొసైటీ చైర్‌పర్సన్ కొణిదెల నాగేంద్రబాబు శనివారం అరణ్యారామం ప్రదేశాన్ని సందర్శించి అక్కడ కొనసాగుతున్న పనులను పరిశీలించారు. అరణ్యారామం ప్రదేశంలో చేపడుతున్న వృక్షాల తరలింపు (ట్రాన్స్‌లోకేషన్) ప్రక్రియను ఆయన పరిశీలించి అభివృద్ధి పనుల సందర్భంగా అక్కడ ఉన్న వృక్షాలను పరిరక్షించి సంరక్షించేందుకు అటవీ శాఖ చేస్తున్న కృషిని అభినందించారు. ఇప్పటివరకు వృక్ష సంరక్షణ చర్యల్లో భాగంగా అరణ్యారామం ప్రదేశం నుంచి 45 చెట్లను విజయవంతంగా తరలించారు. అనంతరం కొణిదెల నాగేంద్రబాబు అరణ్యారామం...