Friday, September 11, 2026
spot_imgspot_img

ప్రాణాంతక వ్యాధులపై సమర శంఖం.. తొలిదశలో గుర్తిస్తేనే సంపూర్ణ నివారణ

Must read

📰 Generate e-Paper Clip

యశోద హాస్పిటల్స్ వైద్యుల వెల్లడి

గుంటూరు. 05 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మారుతున్న ఆధునిక జీవనశైలి, తీవ్రమవుతున్న వాతావరణ కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మానవ మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతూ ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తున్నాయని, ముఖ్యంగా ఊపిరితిత్తులు, ఛాతీ, కాలేయం, జీర్ణాశయం తదితర కీలక అవయవాల పనితీరు దెబ్బతిని ఎంతోమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని యశోదా హాస్పిటల్స్ వైద్యులు వెల్లడించారు. గుంటూరు నగరం బ్రాడీపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోదా హాస్పిటల్స్ వైద్యులు మాట్లాడుతూ వ్యాధి లక్షణాలను ప్రాథమిక దశలోనే పసిగట్టి కచ్చితమైన వైద్యం అందిస్తే సంపూర్ణ ఆరోగ్యం తథ్యమని వైద్య రంగంలో తమకంటూ సువర్ణాక్షరాలతో లిఖించుకునే స్థాయికి ఎదిగిన ప్రఖ్యాత యశోద హాస్పిటల్స్ వైద్య దిగ్గజాలు స్పష్టం చేశారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో మలక్‌పేట్ విభాగానికి చెందిన థొరాసిక్ సర్జన్ డాక్టర్ రామ్ ఫణీంద్ర, సికింద్రాబాద్ విభాగానికి చెందిన మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ మన్నవ పాల్గొని ప్రజల ఆరోగ్య పరిరక్షణపై కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్ ఫణీంద్ర మాట్లాడుతూ ఛాతీకి సంబంధించిన రుగ్మతలు అత్యంత నిశ్శబ్దంగా దేహంలో విస్తరిస్తాయని, సాధారణ జలుబు, దగ్గుగా భావించి నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దీర్ఘకాలిక దగ్గు, కఫంలో రక్తం పడటం, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది,అకారణంగా బరువు తగ్గడం వంటివి ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇతర ఛాతీ ఇన్‌ఫెక్షన్లకు సంకేతాలుగా భావించాలని, ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగం, కాలుష్యం కోరల్లో చిక్కుకున్న వారు ఈ వ్యాధుల బారిన పడే ప్రమాదం అధికంగా ఉంటుందని అన్నారు.యశోద ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వీడియో అసిస్టెడ్ థొరాసిక్ సర్జరీ (VATS), రోబోటిక్ సర్జరీల ద్వారా అతిచిన్న కోతలతోనే అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలు సునాయాసంగా చేస్తున్నామని, దీనివల్ల రోగులు అతి తక్కువ సమయంలోనే కోలుకుని సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంటుందని వివరించారు.డాక్టర్ అనిల్ కుమార్ మన్నవ మాట్లాడుతూ కడుపులో మంట, అజీర్ణం వంటి చిన్నపాటి సమస్యలే పెద్ద జీర్ణాశయ వ్యాధులకు మూలకారణమని అన్నారు.నేటి యువత, పెద్దలలో సైతం ఒత్తిడి, స్థూలకాయం, మధుమేహం కారణంగా గ్యాస్ట్రిక్, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలు సర్వసాధారణంగా మారాయని తెలిపారు.ఫ్యాటీ లివర్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అది కాలేయ వాపు, సిరోసిస్, చివరకు కాలేయం పూర్తిగా చెడిపోయే ప్రమాదానికి దారితీస్తుందని,ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, ఈఆర్‌సీపీ లాంటి ఆధునిక వైద్య పరిజ్ఞానంతో యశోద ఆసుపత్రిలో జీర్ణకోశ, ప్యాంక్రియాస్ వ్యాధులకు సత్వర, కచ్చితమైన పరిష్కారాలు చూపుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ విభాగాధిపతి వీరంకి వెంకటేశ్వరరావు, గుంటూరు ప్రాంతీయ అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ తిమోతి, హాస్పిటల్ బృందం పాల్గొన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.