టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి ఆర్జీల వివరాలు తెలుసుకోవచ్చు
గుంటూరు, 02 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పి.జి.ఆర్.ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 1100 ఫోన్ చేసి ఆర్జీల వివరాలు తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. మీ కోసం వెబ్ సైట్ లో ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)ను ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోను, మండల స్థాయిలోను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రజలు నేరుగా సోమవారం నిర్వహిస్తున్న పి.జి.ఆర్.ఎస్ లో అర్జీలు సమర్పించవచ్చని లేదా మీ కోసం వెబ్ సైట్ Meekosam.ap.gov.in (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) లో కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పి.జి.ఆర్.ఎస్ కు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1100 ను వినియోగించుకొని, ఆర్జీల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని సూచించారు.


