Thursday, September 10, 2026
spot_imgspot_img

ఉప్పుటేరు పరివాహక ఆక్రమణల తొలగింపుతో రోదిస్తున్న బాధితులు

Must read

📰 Generate e-Paper Clip

ఉప్పుటేరు, 09 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఉప్పుటేరు పరివాహక ప్రాంతంలో ఆక్రమణ లు తొలగించాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేయడంతో ముత్యాల పల్లి, వారతిప్ప గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన దొంగ ఈశ్వర రావు అనే వ్యక్తి గొంతేరు డ్రెయిన్‌ ఆక్రమ ణలకు గురైందని, వీటిని తొలగించి డ్రెయిన్‌ ప్రక్షాళన చేయాలని హైకోర్టును ఆశ్రయించా డు. మూడేళ్లుగా కోర్టులో వాదోపవాదాలు పరిశీలించిన హైకోర్టు ఇటీవల గొంతేరు డ్రెయిన్‌ ఆక్రమించుకుని నిర్మించుకున్న నివా సాలు, వ్యాపార సముదాయాలు, ఆక్వా చెరు వులను తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రెవెన్యూ, డ్రెయినేజీ శాఖల అధికారులు పోలీస్‌, ఫైర్‌ సిబ్బంది పర్య వేక్షణలో శుక్రవారం ఆక్రమణలు గుర్తించి మార్కింగ్‌ ఇచ్చారు. మార్కింగ్‌ ఇచ్చే సమ యంలో గ్రామస్థులు, అధికారులకు మధ్య వాదోపవాదాలు జరగడంతో అధికారులు ఆక్ర మణలు తొలగించాల్సిందేనని మరో సమ యంలో వస్తామని తమకు సహకరించాలని వెనుదిరిగారు. శనివారం ఉదయమే ఆర్డీవో దాసిరాజు అధ్వర్యంలో డివిజన్‌లోని తహ సీల్దార్‌లు, రెవెన్యూ సిబ్బంది, డీఎస్పీ ఎం.సుధాకర్‌ నేతృ త్వంలో సీఐలు, ఎస్‌ఐలు సు మారు 400 మంది పోలీస్‌ సి బ్బంది అగ్ని మాపక, డ్రెయి నేజీ, వైద్య శాఖ సిబ్బంది ఎక్స్‌కవేటర్లతో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. దీంతో కొద్దిసేవు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు మరో ప్రాంతంలో నిర్వాసితులకు స్ధలాలు కేటాయిం చేందుకు హామీ ఇచ్చారు. చెరువులు తొల గించే ముందు సాగు చేసే రైతులకు సమా చారం అందడంతో హడావిడిగా చెరువుల పట్టుబడి చేశారు. చేపలు, రొయ్యలు పట్టుకు నేం దుకు కనీస సమయం లేక పోవడంతో అయినకాడికి అమ్ము కుని తీవ్రంగా నష్టపో యినట్టు రైతులు వాపోయారు. ముత్యాల పల్లి, వారతిప్ప గ్రామాల్లో నివాసాలు కోల్పోయిన పలువురు మహిళలు బోరున విలపించారు. ఈ విషయంపై ఆర్డీవో దాసి రాజును వివరణ కోరగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు, జిల్లా కలెక్టర్‌ సూచనలతో ఈ ఆక్రమణల తొలగింపు చేపట్టామన్నారు. సుమారు 37 నుంచి 40 ఎకరాలు ఆక్రమించి నివాసాలు, వ్యాపార సముదాయాలు, ఆక్వా చెరువులు విస్తరించి ఉన్నాయని వివరించారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.