Friday, September 11, 2026
spot_imgspot_img

టిడిపి కార్యలయం లో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

గుంటూరు, 15 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : 80 స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మహమ్మద్ నశీర్ అహ్మద్, టిడిపి జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావుతో కలిసి జాతీయ జెండాను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ,గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశ ప్రజలకు 80 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలన్నారు. లక్షలాదిమంది స్వాతంత్ర్య సమరయోధుల ప్రాణత్యాగాలకు నిదర్శనం మన భారతదేశం. 80 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో మన దేశం ఎంతో ముందుకు వెళ్ళింది. ఎక్స్పోర్ట్స్, డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్ వంటి ఎన్నో రంగాలలో అధునాతన విధంగా మన భారతదేశ ముందుకు వెళుతోంది. యువత, మహిళలు, రైతులు అందరూ తమ సంకల్పాన్ని భారతదేశ అభ్యున్నతికి ఉపయోగించాలి. ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలి. అందరికీ మరొక్కసారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వర్, మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మ్యాని, టిడిపి నాయకులు ముత్తినేని రాజేష్, వేములపల్లి శివరామకృష్ణ ప్రసాద్ (బుజ్జి), చిట్టాబత్తిన చిట్టిబాబు, డా.నిమ్మల శేషయ్య తదితరులు పాల్గొన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.