Friday, September 11, 2026
spot_imgspot_img

కాపునాడు గుంటూరు జిల్లా నూతన కార్యవర్గం నియామకం

Must read

📰 Generate e-Paper Clip

గుంటూరు, 11 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కాపునాడు గుంటూరు జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటయింది. జిల్లా అధ్యక్షుడుగా చలువాది రాంబాబు నియమితులయ్యారు. అదేవిధంగా యువజన విభాగం అధ్యక్షుడుగా గోలి శ్రావణ్ కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు మంగళవారం అమరావతి రోడ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ళ సుబ్రమణ్యం చేతుల మీదుగా రాంబాబు, శ్రావణ్ కుమార్ నియామక పత్రాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కాపునాడు జోన్ 3 అధ్యక్షుడు బొందలపాటి వెంకట్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యర్రగోపు నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాగం సదాశివరావు, విజయవాడ సిటీ అధ్యక్షుడు పరుచూరి కరుణాకర్, సూరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు. ఈనెల 16వ తేదీన విజయవాడలో కాపు జేఏసీ సమావేశం జరుగుతుంది. కాపు ప్రతినిధులు అందరూ హాజరై జయప్రదం చేయాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాపులకు రిజర్వేషన్ కల్పించాలి. విదేశీ విద్యకు నిధులు విడుదల చేయాలి. కాపు భవనాలు నిర్మించి, కాపు కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. అదేవిధంగా తమకు అప్పజెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి జిల్లాలో కాపునాడుని మరింత బలోపేతం చేసి, కాపుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని రాంబాబు, శ్రావణ్ తెలిపారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.