Friday, September 11, 2026
spot_imgspot_img

తిరుపతి డిప్యూటీ ఈవో ఇంట ఏసీబీ సోదాలు !

Must read

📰 Generate e-Paper Clip

రూ.5 కోట్ల ఆస్తుల గుర్తింపు

తిరుమల, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : తిరుమల టీటీడీ శ్రీవారి ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెందు లోకనాథంపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏపీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బుధవారం ఏకకాలంలో నాలుగు చోట్ల సోదాలు నిర్వహించింది. సోదాల్లో స్థిరాస్తుల పత్రాలు, నగదు, బంగారం, వెండి, ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ తెలిపింది. తిరుపతి, వడమాలపేట ప్రాంతాలతో పాటు కుటుంబ సభ్యుల పేర్లపై స్థలాలు, భవనాలు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొంది. ఇప్పటివరకు సుమారు రూ.5 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్లు వెల్లడించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ తెలిపింది.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.