తిరుపతి డిప్యూటీ ఈవో ఇంట ఏసీబీ సోదాలు !
రూ.5 కోట్ల ఆస్తుల గుర్తింపు తిరుమల, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : తిరుమల టీటీడీ శ్రీవారి ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెందు లోకనాథంపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏపీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బుధవారం ఏకకాలంలో నాలుగు చోట్ల సోదాలు నిర్వహించింది. సోదాల్లో స్థిరాస్తుల పత్రాలు, నగదు, బంగారం, వెండి, ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ తెలిపింది. తిరుపతి, వడమాలపేట ప్రాంతాలతో పాటు కుటుంబ సభ్యుల పేర్లపై స్థలాలు,...