గుంటూరు, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలపై నగర కమిషనర్ మయూర్ అశోక్ సీరియస్ అయ్యారు. గురువారం పట్నంబజార్ లోని హోల్సేల్ షాప్ ల్లో నేరుగా తనిఖీ చేశారు. తనిఖీల్లో ప్రజారోగ్యానికి భంగం కల్గించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గుర్తింపు, షాప్ ల సీజ్, అపరాధ రుసుం విధించారు. గత 45 రోజుల నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అమ్మడం, వినియోగించడంపై నిషేధం పై తెలిపినా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం, ట్రేడ్ లైసెన్స్ లు లేకుండా షాప్ లు నిర్వహిస్తున్నా పట్టించుకోకపోవడంపై శానిటరీ ఇన్స్పెక్టర్, సెక్రెటరీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సిఎంఓహెచ్ ను కమిషనర్ ఆదేశించారు. హోల్ సేల్ షాప్ లకు క్యారీ బ్యాగ్ లు సరఫరా చేస్తున్న తయారీ సంస్థల వివరాలు తీసుకొని, నిర్దేశిత చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలే కాకుండా వినియోగించే వారిపై కూడా అపరాధ రుసుం విధించాలని, తాము ఆకస్మిక తనిఖీలు చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.


