పెదకాకాని, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లా, పెదకాకాని గ్రామ (మాజీ సర్పంచ్) స్వర్గీయ ఆళ్ల దశరథ రామిరెడ్డి మనకు భౌతికంగా దూరమై నేటికి ఆరేళ్లు.. ఆయన 6వ వర్ధంతి సందర్భంగా నేడు (సెప్టెంబర్ 03) పెదకాకాని గ్రామంలో స్థానిక నాయకులు ఆళ్ల దశరథ రామిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సర్పంచ్ గా కేవలం పెదకాకాని గ్రామానికే కాకుండా గుంటూరు జిల్లాకు వివిధ రూపాల్లో అందించిన చిరస్మరణీయ సేవల్ని స్మరించుకున్నారు. అవసరార్థం ఆయన్ని ఆశ్రయించిన వారికి కాదనకుండా, లేదనకుండా తన శక్తి మేరకు సాయం అందించేవారని గుర్తు చేసుకున్నారు. ప్రధానంగా ఎన్నో ఆటంకాలను అధిగమించి పెదకాకాని గ్రామానికి మంచినీటిని అందించిన అపర భగీరథుడుగా దశరథ రామిరెడ్డి ఎప్పటికీ ప్రజల మనస్సుల్లో కొలువై ఉంటారని పలువురు నాయకులు, గ్రామస్థులు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సుంకర వెంకట కృష్ణారెడ్డి, ముడియాల మల్లికార్జున్ రెడ్డి, తాడిబోయిన వేణుగోపాల్, షేక్ నజీర్, ఆలపాటి రాఘవ, బెజవాడ శివయ్య, సుంకర నర్సిరెడ్డి, ఆళ్ళ సుబ్బారెడ్డి, కోట యలమంద రెడ్డి, సిరిబోయిన అవినాష్, షేక్ షహనాజ్, పెనుమళ్ళ అరుణ్ కుమార్, యడ్లపల్లి రమేష్, వాసిమళ్ళ నాగేశ్వరరావు, వీర్ల ఆంజనేయులు తద్ధితరులు పాల్గొన్నారు.


