Friday, September 11, 2026
spot_imgspot_img

జలయజ్ఞం తో రాష్ట్రాని సస్యశ్యామలం చేసింది వై‌ఎస్‌ఆర్

Must read

📰 Generate e-Paper Clip

17వ వర్ధంతి సందర్బంగా పులిచింతల జలాలతో అభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

పెదకూరపాడు, 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జలయజ్ఞం అంటే గుర్తొచ్చేది ఒకేఒక్క నాయకుడు దివంగత నేత వై.యస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. దివంగత నేత వై యస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్బంగా బుధవారం అచ్చంపేట మండలం మాదిపాడు శివారులోని కంచుబోడుతండాలో ఏర్పాటు చేసిన దివంగత నేత డా. వై యస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆవిష్కరణ చేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జలయజ్ఞం అంటే గుర్తుకు వచ్చేది ఒకేఒక్క నాయకుడు వై‌ఎస్‌ఆర్ అని, పోలవరం, వెలిగొండ, పులిచింతల వంటి ప్రాజెక్ట్ లు ప్రారంభించి జలప్రదాత గా నిలిచారన్నారు. నేడు వారి వర్ధంతి సందర్బంగా పులిచింత ప్రాజెక్ట్ నీళ్లతో జాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమమే ద్వేయంగా రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహానేత రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. పోలవరం, వెలిగొండ, పులిచింతల ప్రాజెక్ట్ లను శంకుస్థాపన చేసి, పనులు కూడా చేస్తే నేడు చంద్రబాబు నాయుడు తానే చేసానని డబ్బా కొట్టుకుంటున్నారని ఏద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వమే తప్పా చేతల ప్రభుత్వం కాదన్నారు. రాజన్న రాజ్యం మళ్ళీ జగనన్న తోనే సాధ్యం అయ్యిందని మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి సంక్షేమ పాలన కోనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.