జలయజ్ఞం తో రాష్ట్రాని సస్యశ్యామలం చేసింది వైఎస్‌ఆర్
17వ వర్ధంతి సందర్బంగా పులిచింతల జలాలతో అభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పెదకూరపాడు, 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జలయజ్ఞం అంటే గుర్తొచ్చేది ఒకేఒక్క నాయకుడు దివంగత నేత వై.యస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. దివంగత నేత వై యస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్బంగా బుధవారం అచ్చంపేట మండలం మాదిపాడు శివారులోని కంచుబోడుతండాలో ఏర్పాటు చేసిన దివంగత నేత డా. వై యస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని మాజీ...