Friday, September 11, 2026
spot_imgspot_img

పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Must read

📰 Generate e-Paper Clip

గుంటూరు, 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మరియు సినీనటుడు నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీనివాసరావుపేటలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అనంతరం మిర్చియార్డు డైరెక్టర్ కటకంశెట్టి విజయలక్ష్మి ఆధ్వర్యంలో బ్రాడిపేటలోని షిరిడి సాయి దీన జనసేవ సమితిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే విద్యార్థులకు పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు. విద్యార్థులు విద్యతో పాటు మంచి విలువలను అలవరచుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. సమాజ అభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా హెల్మెట్ & మొక్కలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి : సినీనటుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా తిరువీధి హరికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. అలాగే ప్రజలకు మొక్కలు అందజేసి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.