పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు, 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మరియు సినీనటుడు నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీనివాసరావుపేటలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అనంతరం...