గుంటూరు, 01 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలో పెన్షన్ లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి నేరుగా పెన్షన్లు అందజేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అన్నారు. మంగళవారం సంపత్ నగర్ ప్రాంతంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదును కమిషనర్ అందించారు. వృద్ధులు, దివ్యాంగులు పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అర్హులందరికీ సమయానికి, పారదర్శకంగా అందిస్తామని కమిషనర్ తెలిపారు.


