గుంటూరు, 21 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా పై కక్షతో అక్రమ కేసు నమోదు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు సందేటి రాజేష్ మండిపడ్డారు. మహమ్మద్ ముస్తఫా కు బెయిల్ మంజూరు కావాలని కోరుతూ శుక్రవారం పాత బస్టాండ్ మత్తయ్య చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు మాట్లాడుతూ వ్యాపార సమస్యను ఆసరాగా చేసుకొని అక్రమ కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. భగవంతుడు ఆశీస్సులు, దీవెనలతో త్వరగా బెయిల్ మంజూరు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్,ధూపాటి సల్మాన్, జ్యోతి బాబు, ధూపాటి వంశీ, ఇర్మియా, అనిల్ పలువురు నాయకులు పాల్గొన్నారు.


