Friday, September 11, 2026
spot_imgspot_img

ఓటర్లు హియరింగ్ కి తప్పనిసరిగా హాజరు కావాలి

Must read

📰 Generate e-Paper Clip

గుంటూరు, 17 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ కార్యక్రమంలో భాగంగా నోటీసులు అందుకున్న వారికి హియరింగ్ జరుగుతుందని, నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరై తమ ఓటు హక్కు నిలుపుకోవాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కార్యక్రమంలో భాగంగా గత నెల రోజులుగా ఓటర్లు ఎన్యురేషన్ ఫారాలు అందించారని, ఓటర్లను ఎన్నికల అధికారులు ప్రత్యేక క్యాంపన్ ద్వారా మ్యాపింగ్ చేశారని తెలిపారు. ఓటర్లకు చిన్నచిన్న అక్షర దోషాలుగానీ, తల్లిదండ్రుల పేర్లు మ్యాచింగ్ అవ్వకపోవడంగానీ వంటి సమస్యలు ఉన్నవారికి నోటీసులు జారీ చేశారన్నారు. ఆయా నోటీసులు అందుకున్న ప్రతి ఓటరూ హియరింగ్ కు హాజరు కావాలని సూచించారు. కేంద్రం ఎన్నికల సంఘం సూచించిన ధ్రువీకరణ పత్రాలలో ఏదైనా తీసుకెళ్లవచ్చని చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నోటీసులు అందుకున్న ఓటర్లకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఏదైనా సందేహాలు ఉన్నా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఓటర్లకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సహకారం అందిస్తామని, అదే సమయంలో గుంటూరు మున్సిపల్ కార్యాలయంలోనూ సంప్రదించవచ్చని తెలియజేశారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.