ఓటర్లు హియరింగ్ కి తప్పనిసరిగా హాజరు కావాలి

గుంటూరు, 17 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ కార్యక్రమంలో భాగంగా నోటీసులు అందుకున్న వారికి హియరింగ్ జరుగుతుందని, నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరై తమ ఓటు హక్కు నిలుపుకోవాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కార్యక్రమంలో భాగంగా గత నెల రోజులుగా ఓటర్లు ఎన్యురేషన్ ఫారాలు అందించారని, ఓటర్లను ఎన్నికల అధికారులు ప్రత్యేక క్యాంపన్ ద్వారా...