కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు, 16 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీనివాసరావుతోటలో పేదలకు బియ్యం , నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొన్న పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా సేవయే మాధవ సేవ అన్న సూత్రంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్నవారు పేదలకు , ఆపన్నులకు అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వ పధకాలతో పాటుగా ఇలాంటి అదనపు సేవా కార్యక్రమాలు పేదలకు మరింత ఉపశమనాన్ని కలిగిస్తాయన్నారు. ప్రతీ ఒక్కరూ సేవా భావంతో స్పందిస్తే అసమానతలు , ఆకలి లేని సమాజాన్ని నిర్మించవచ్చని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. నండూరి స్వామి , వడ్డె సుబ్బారావు, కాసులు తదితరులు పాల్గొన్నారు.


