పేద ప్రజలకు అదనంగా సేవలందించాలి
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు, 16 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీనివాసరావుతోటలో పేదలకు బియ్యం , నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొన్న పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా సేవయే మాధవ సేవ అన్న సూత్రంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్నవారు పేదలకు , ఆపన్నులకు...