Thursday, September 10, 2026
spot_imgspot_img

పెదకాకాని అమ్మవారి మంగళసూత్రాలు చోరీ కేసు నిందితుడు అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

68 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం

పెదకాకాని, 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పెదకాకాని శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి మొత్తం 68 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీ ఘటనపై క్రైం నంబర్ 448/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 50 గ్రాముల నాగాభరణం, రెండు బంగారు మంగళసూత్రాలు, బంగారు గుత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు వెల్లడించారు. కేసును ఛేదించి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.