ప్రత్తిపాడు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అక్రమంగా తరలిస్తున్న సుమారు 30 క్వింటాళ్ల పీడీఎస్ రేషన్ బియ్యాన్ని రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. ప్రత్తిపాడు మండలంలోని కాటూరి హాస్పిటల్ సమీపంలో శుక్రవారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్తిపాడు డిప్యూటీ తహసీల్దార్ శివశంకర్, గుంటూరు వెస్ట్ పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ బేగ్ సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా AP 07 TM 1542 నంబరు గల వాహనంలో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాహనాన్ని సీజ్ చేసి, బియ్యంతో సహా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారులు కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టనున్నారు.


