అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ప్రత్తిపాడు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అక్రమంగా తరలిస్తున్న సుమారు 30 క్వింటాళ్ల పీడీఎస్ రేషన్ బియ్యాన్ని రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. ప్రత్తిపాడు మండలంలోని కాటూరి హాస్పిటల్ సమీపంలో శుక్రవారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్తిపాడు డిప్యూటీ తహసీల్దార్ శివశంకర్, గుంటూరు వెస్ట్ పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ బేగ్ సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా AP 07 TM 1542 నంబరు గల వాహనంలో ఎలాంటి అధికారిక అనుమతులు...