Thursday, September 10, 2026
spot_imgspot_img

పిజిఆర్ఎస్ లో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

గుంటూరు, 07 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజలు అందిస్తున్న అర్జీల పరిష్కారం నాణ్యతతో కూడినదై ఉండాలని జిల్లా  కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్బంగా  కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యల సత్వర పరిష్కారం కోసం అర్జీలను అందజేస్తుంటారని వారి అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించాలన్నారు. అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించడంతో పాటు, పరిష్కారం సాధ్యంకాని అంశాలపై స్పష్టమైన కారణాలను అర్జీదారులకు తెలియజేయాలని ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని  కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా పరిషత్ సీఈవో  వి.జ్యోతి బసు,  డ్వామా పిడి శంకర్, డిప్యూటీ కలెక్టర్ లు గంగ రాజు, లక్ష్మీ కుమారి, జిల్లా మైనారిటీ ఆఫీసర్  జె.పార్థసారథి ప్రజల నుంచి ప్రజా సమస్యల ను స్వీకరించి సంబంధిత అధికారుల కు అంద జేశారు. జిల్లాలో పి.జి.ఆర్.ఎస్ కు మొత్తం 525 అర్జీలు అందాయి. అందులో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పి.జి.ఆర్.ఎస్ కు 284, పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలో జరిగిన పి.జి.ఆర్.ఎస్ కు 172 అర్జీలు, గుంటూరు రెవిన్యూ డివిజన్ పరిధిలో 10 అర్జీలు, తెనాలి రెవిన్యూ డివిజన్ పరిధిలో 22 అర్జీలు, గుంటూరు నగర పాలక సంస్థకు 35, మిగిలిన మున్సిపాలిటీల పరిధిలో 2 అర్జీలు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)కు జిల్లా అటవీ అధికారి ఎం.హిమ శైలజ, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి సత్యనారాయణ, డి.టి.సి సీతారామి రెడ్డి , జిల్లా ఉపాధి కల్పనా అధికారి అభినవ్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు పి.సత్యనారాయణ చౌదరి, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ టి. నరసింహా రెడ్డి, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి, జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం భాషా, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.