పిజిఆర్ఎస్ లో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్
గుంటూరు, 07 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజలు అందిస్తున్న అర్జీల పరిష్కారం నాణ్యతతో కూడినదై ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యల సత్వర పరిష్కారం కోసం అర్జీలను అందజేస్తుంటారని వారి అర్జీలను నిర్లక్ష్యం...