Friday, September 11, 2026
spot_imgspot_img

స్కూల్ బస్సు కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

 

ఇబ్రహీంపట్నం, 22 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కట్టుబడిపాలెం తారకరామా ఎత్తిపోతల పథకం కాల్వలో బోల్తా కొట్టిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు స్కూల్ ముగించుకొని మరికొద్ది సేపట్లో విద్యార్థులు తమ తమ ఇళ్లకు చేరుకుంటాం అనుకున్న సమయంలో అనుకోకుండా ప్రమాదవశాత్తు అదుపుతప్పి స్కూల్ బస్సు కాలువలో బోల్తా కొట్టింది ఆ క్రమంలో బస్సులో సుమారు 24 మంది దాకా చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో గట్టిగా కేకలు వేస్తున్న చిన్నారుల ఆక్రందనలు విన్న స్థానిక రైతులు స్థానికులు వెంటనే ఒక్కొక్క చిన్నారిని నీటిలో బోల్తా కొట్టిన బస్సులో నుండి బయటకు తీయడం జరిగింది ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రయాణం నష్టం జరగలేదు కానీ చిన్నారులకు మాత్రం చిన్నచిన్న స్వల్ప గాయాలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటపడ్డ చిన్నారులు గజగజ వనికి పోతూ ఆ గ్రంధాలు చేస్తూనే ఉన్నారు జగించిన స్థానికులు వెంటనే చిన్నారులకు వైద్యా సేవలు అందించారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కట్టుబడి పాలెం ప్రాంత వాసులు ఏమైంది అంటూ హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకొని స్థానిక ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు వెంటనే స్పందించిన ఇబ్రహీంపట్నం సీఐ ఏ సుబ్రహ్మణ్యం తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని చిన్నారులను సురక్షితంగా బయటికి తీశారు దీంతో ఒకసారిగా ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగాలు అసలు తరచూ ప్రమాదాలకు కారణం అవుతున్న స్కూల్ బస్సుల నిర్వహణ బస్సులో సాంకేతిక లోపాలు గుర్తించాలని రవాణా సంస్థ శాఖ అధికారులు ఇకనైనా మేల్కొని స్కూల్ బస్సుల నిర్వహణ బస్సుల సామర్థ్యం బస్సు యొక్క ఫిట్నెస్ సర్టిఫికెట్లతో చిన్నారుల ప్రాణాలకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పాఠశాల యాజమాన్యాలను కోరారు. పట్టుమని 15 రోజులు గడవకముందే మరోసారి స్కూల్ బస్సు ప్రమాదాలకు గురి కావడం ఏంటి అనేక ప్రశ్నలు తల్లిదండ్రులలో ఉత్పన్నమవుతున్నాయి దీంతో పాఠశాలలకు తమ పిల్లలను బస్సులో ప్రయాణించాలంటే గడగడలాడిపోతున్నామంటూ చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా రవాణా శాఖ అధికారులు స్పందించి ప్రతి ఒక్క స్కూల్ బస్సు ఫిట్నెస్ సర్టిఫికెట్లతో నడిపించాలని తల్లిదండ్రులు కోరారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.