మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు
గుంటూరు, 21 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : శాసన మండలిలో పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉంటేనే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు అన్నారు. శుక్రవారం గుంటూరులోని టీటీడీ కళ్యాణ మండలంలో పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఎం.హనుమంతరావు పరిచయ సభ కార్యక్రమం జరిగింది. అనంతరం మీడియాతో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి హనుమంతరావు మాట్లాడుతూ కూటమి పాలనలో ప్రభుత్వ, కాంటాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో శాసన మండలిలో ఉద్యోగుల సమస్యలపై మాట్లాడే అభ్యర్థి ఉండాల్సిన అవసరం ఉందన్నారు.


