Friday, September 11, 2026
spot_imgspot_img

ఏ‌ఎన్‌యూ లో ఉచిత మొబైల్ రిపేరింగ్ శిక్షణల ముగింపు

Must read

📰 Generate e-Paper Clip

గుంటూరు, 14 ఆగస్ట్ 14.2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సి ఎస్ ఆర్ , ఎక్స్ ఎల్ ఆర్ ఆధ్వర్యంలో రూసా సహకారంతో నిర్వహించిన 5 రోజుల ఉచిత మొబైల్ రిపేరింగ్ శిక్షణ ముగిసింది. ప్రతి ఒక్కరూ మొబైల్ రిపేరింగ్పై ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండాలని వీసీ గంగాధర్ అన్నారు. సి ఎస్ ఆర్ సామాజిక సేవా కార్యక్రమాలను పాలకమండలి సభ్యుడు వేణుగోపాల్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉపయుక్తమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శిక్షణ పూర్తిచేసిన వారికి ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ఎల్ఆర్ కో ఫౌండర్ శ్రీనివాస్ రెడ్డి, సి ఎస్ ఆర్ సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్.ఎం. వెంకటరమణ, మొబైల్ రిపేరింగ్ శిక్షకులు మాధవ్, సిఎస్ఆర్ సిబ్బంది వీరాంజనేయులు, ఏసన్న తదితరులు పాల్గొన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.