గుంటూరు, 18 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏప్రిల్-2026పీజీ నాలుగో సెమిస్టర్ ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఏ వెంకటేశ్వర్లు మంగళవారం విడుదల చేశారు. మ్యూజిక్ (వోకల్), ఎంబీఏ మీడియా మేనేజ్మెంట్లో 100 శాతం, ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో 94.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రీవాల్యుయేషన్కు ఆగస్టు 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి సబ్జెక్టుకు రీవాల్యుయేషన్ ఫీజు రూ.1,860, పర్సనల్ వెరిఫికేషన్ ఫీజు రూ.2,190గా నిర్ణయించినట్లు ఎ.వెంకటేశ్వర్లు తెలియజేశారు.


