గుంటూరు, 10 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు రైల్వే ఖాళీ స్థలాలు, ఎకో పార్క్లో 5 వేల మొక్కలు నాటేందుకు పౌర సంస్థలు ముందుకొచ్చాయి. ఈ మేరకు డిఆర్ఎం సుదేష్ణ సేన్ ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ నెల 16న ఉదయం 7 గంటలకు ఎకో పార్క్ మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించనున్నారు. నాటిన మొక్కలను సంరక్షించి పెద్ద వృక్షాలుగా తీర్చిదిద్దుతామని సంస్థల ప్రతినిధులు తెలిపారు. గుంటూరులో పచ్చదనం పెంపొందించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని డిఆర్ఎం అన్నారు.


