Thursday, September 10, 2026
spot_imgspot_img

ఎన్నికలకు ముందస్తుగా క్యాలెండర్ సిద్ధం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

జిఎంసి కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు, 19 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు ముందస్తుగా ఓటర్ల లిస్టు ప్రకటన, ఎన్యూమరేషణ్, వార్డ్ ల రిజర్వేషన్ తదితర అంశాలతో ముందస్తుగా క్యాలెండర్ సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లుపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియకు సదా సిద్దంగా ఉండాలన్నారు. వార్డ్ ల వారీగా ఓటర్ల సర్వే చేయడానికి, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల పర్యవేక్షణ, ఇతర విధులకు అవసరమైన సిబ్బందికి ముందస్తుగానే అవగాహన కల్గించాలన్నారు. ఆర్ఓలు, ఏఆర్ఓలు, బ్యాలెట్ పెట్టెలు, మాస్టర్ ట్రైనర్ల అవసరంపై జిల్లా ఎన్నికల అధికారికి అందించేందుకు రిపోర్ట్ సిద్దం చేయాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు. అదేవిదంగా సున్నితమైన, అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాలు, వాటి బందోబస్తు పై కూడా లిస్టు సిద్దం చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ కిషోర్, డిప్యూటీ కమిషనర్లు జి.సాంబశివరావు, బి.శ్రీనివాసరావు, సిటి ప్లానర్ రాంబాబు, ఏసిపీ రెహ్మాన్, డిప్యూటీ తహశీల్దార్లు నాగ మల్లేశ్వరరావు, కిరణ్మై పాల్గొన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.