గుంటూరు, 23 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు అరండల్ పేట లో హొటల్ లీలా ఇంపీరియల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా భాష్యం రామకృష్ణ విచ్చేసి వేదవవచనాల మధ్య ప్రారంభోత్సవం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రొప్రైటర్ పిన్నమనేని రామచంద్ర రావు మరియు రవికుమార్ ముఖ్య అతిధులు, మరియు బంధు మిత్రులు మరియు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ గుంటూరులో అందరికీ అందుబాటులో విశాలమైన రూఫ్ గార్డెనింగ్ తోటి, బాక్వెంట్ హాల్, 500 మంది అతిథులు ఆసీనులగునట్లు అందుబాటులో ఉంచారని అంతేకాకుండా కాఫీ 24/7 మరి ముఖ్యంగా శాఖాహారానికి, మాంసాహారానికి సంబంధించిన వంటశాలలు వేరువేరుగా ఉన్నాయని ఇది ఎంతో అభినందనీయమైన విషయమని ఆయన తెలియజేశారు అనంతరం ముఖ్య అతిథి భాష్యం రామకృష్ణ ను ఘనంగా సన్మానించారు.


