Friday, September 11, 2026
spot_imgspot_img

స్థానిక ఎన్నికలపై కసరత్తు

Must read

📰 Generate e-Paper Clip

మున్సిపల్‌ అధికారులతో 6న ఎన్నికల కమిషనర్‌ భేటీ

అమరావతి, 31 జూలై 2026, భారత్ ప్రతినిధి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పునేఠా ఈ నెల 6న మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ అధికారులతో భేటీ కానున్నారు. స్థానికసంస్థల ఎన్నికలకు సంబంధించిన కసరత్తు ప్రారంభించేలా దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్‌ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ నివేదిక ఇచ్చిన తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. కమిషన్‌కు అవసరమైన బీసీ జనాభా వివరాలను పంచాయతీరాజ్‌శాఖ అందించింది. ముందు మున్సిపల్‌, ఆ తర్వాత పరిషత్‌, చివరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ క్రమంలో మున్సిపల్‌ వార్డుల విభజన, కోర్టులో కేసు కారణంగా స్టే ఉన్న మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ చర్చించనున్నారు. స్థానికసంస్థల ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు చేయనున్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.